up accident: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని ఘటమ్ పూర్ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రికా దేవి ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న యాత్రికుల ట్రాక్టర్ ఘటంపూర్ ప్రాంతంలోని చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 16మంది తీవ్రంగాయ గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. చెరువు నుంచి ఇప్పటి వరకు 22మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ తెలిపారు.
Read also: tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్
ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయాలపాలైన వారికి 50వేల రూపాయలను ఇవ్వనున్నట్లు పీఎంవో ప్రకటించింది. ఈ దుర్ఘటన తనను బాధించినట్లు మోదీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Read also:lizard in the curry: హాస్టల్ వంటలో బల్లి.. 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత
అలాగే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను యోగి పర్యవేక్షించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను వేగిరం చేయాలంటూ మంత్రులు రాకేష్ సచన్, అజిత్ పాల్‌ను ఆదేశించారు.