Karnataka Cabinet: కర్ణాటకలో కొత్తగా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్తగా ఏర్పాడిన సిద్ధరామయ్య సర్కార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వంలో 34మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా పదిమంది మే 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read : Priyank Kharge : రాజకీయ దుమారం రేపుతున్న ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలు
Also Read
కాగా.. మిగిలిన 24 మంది కొత్త మంత్రులు ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితాలో ఉన్నారు. కొత్త మంత్రులైన ఎమ్మెల్యేల జాబితాలో దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడి, ఆర్బి.తిమ్మాపూర్, బి.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి. సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ, సుధాకర్, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కెఎన్.రాజన్న, కె. వెంటకేశ్, హెచ్‌సీ మహదేవప్ప, బైరతి సురేష్ ఉన్నారు.
Also Read : Smita sabharwal: తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.. స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
అయితే, తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 24 మందిలో తొమ్మిది మంది తొలిసారిగా ఎన్నికైన వారు.. కాగా అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఆరుగురు వొక్కలిగలు, ఎనిమిది మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. ముగ్గురు మంత్రులు షెడ్యూల్డ్ కులాలు, ఇద్దరు షెడ్యూల్డ్ తెగలు, ఐదుగురు ఇతర వెనుకబడిన వర్గాల వారికి అవకాశం దక్కింది. క్యాబినెట్లో బ్రాహ్మణులకు కూడా ప్రాతినిధ్యం లభించింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు కుల, ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణలో సమతూకం పాటించారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!