Priyank Kharge : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటకలోని చిత్తాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ప్రకటన దుమారం రేపుతోంది. ఈ ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. బజరంగ్‌దళ్ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా నిషేధం విధించవచ్చని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Read Also:NITI Aayog: నీతి ఆయోగ్ మీటింగ్ కు 9 మంది సీఎంలు డుమ్మా
ప్రధాని మోదీ స్వయంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ అన్నారు. మేమంతా సంఘ్ వాలంటీర్లమే. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వాలు నిషేధించాలని ప్రయత్నించాయని, కానీ ఎప్పటికీ విజయవంతం కాలేదని కటీల్ అన్నారు. బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌లను నిషేధించాలని మీరు (కాంగ్రెస్) ప్రయత్నిస్తే బూడిదలో పోసిన పన్నీరే అని కటీల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రియాంక్‌కి సలహా ఇస్తూ.. ముందుగా దేశ చరిత్ర తెలుసుకోవాలని, నాలుకపై కూడా శ్రద్ధ పెట్టాలని అన్నారు.
Read Also:Mahanadu 2023: 160 స్థానాల్లో గెలవడం.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం..
ప్రియాంక్ ఖర్గే ప్రకటనతో రాజకీయాలు వేడెక్కాయి. దీన్ని బీజేపీ వ్యతిరేకించింది. పాఠశాల పాఠ్యాంశాల్లో మార్పులు, మత మార్పిడి నిరోధక చట్టం వంటి బీజేపీ ప్రభుత్వంలో చేసిన ఉత్తర్వులు, చట్టాలను సమీక్షిస్తామని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తే, ప్రభుత్వం దానిని సవరించడం లేదా ఉపసంహరించుకోవడం చేస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రాగానే బజరంగ్ దళ్, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధించాలని కూడా రాశారు. ఇదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగింది. ఈ అంశంపై కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడింది.