2025 TVS Raider 125: భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన రైడర్ 125 (2025 TVS Raider 125) బైక్‌ను 2025 సంవత్సరానికి కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. 125cc సెగ్మెంట్లో వివిధ కంపెనీల మోడళ్ల నుంచి పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు తీసుకొచ్చారు. ఈ అప్డేట్లపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో ద్వారా ఈ ఫీచర్లు వెల్లడయ్యాయి.
Dasara : మాంసం ప్రియులకు బిగ్ ఆప్డేట్..!
కొత్తగా అప్డేట్ అయిన టీవీఎస్ రైడర్ 125 మెకానిక్స్ పరంగా అప్డేట్ అయ్యింది. ఇందులో సింగిల్ ఛానెల్ సూపర్ మోటో ఏబీఎస్ (ABS)తో కూడిన కొత్త వెనుక డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్లోని ఏ బైక్‌లోనూ లేకపోవడం విశేషం. ఈ యూనిట్లో ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లతో కూడిన పెటల్ డిస్క్ ఉంది. ఇది ముందు వైపు ఉన్న యూనిట్‌ను పోలి ఉంటుంది. దీని సరైన పనితీరు కోసం, కాలిపర్కు ప్రొటక్షన్ కూడా ఇచ్చారు.
బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు.. బైక్‌కు ముందు, వెనుక వైపు కొత్తగా ఫ్యాటర్ టైర్లను అమర్చారు. ముందు వైపు ఇప్పుడు 90-సెక్షన్ టైర్, వెనుక వైపు 110-సెక్షన్ యూనిట్ ఉంది. ఇది బైక్‌కు మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇవన్నీ కొత్త కలర్ స్కీమ్స్‌తో వస్తాయి. ఎరుపు, తెలుపు కలయికతో కూడిన కొత్త పెయింట్ స్కీమ్ అందుబాటులోకి రానుంది. మిగతా డిజైన్, ఇంజన్ వివరాలు పాత మోడల్లాగే ఉన్నాయి.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రేపు వీఐపీ దర్శనాలకు బ్రేక్..!
టీవీఎస్ రైడర్ 125లో 124.8cc సింగిల్ సిలిండర్ 3V ఎయిర్-కూల్డ్ ఇంజన్ కొనసాగుతుంది. ఇది 11.2HP పవర్, 11.2NM పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. అలాగే, ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ టెయిల్లైట్లు, హాలోజెన్ టర్న్ ఇండికేటర్లు వంటి ఫీచర్లు పాత మోడల్లాగే కొనసాగుతున్నాయి.