Skoda Octavia AWD: 2025 స్కోడా ఆక్టావియా AWD గ్లోబల్ మార్కెట్‌లో మరింత అధునాతన ఫీచర్లతో విడుదల కానుంది. ఈ సరికొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ పనితీరుతో రాబోతుంది. ఇందులో 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది గరిష్ఠంగా 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గత మోడల్‌తో పోల్చితే 14 bhp అధిక శక్తిని అందించగల ఈ ఇంజిన్ ఆక్టావియాను మరింత శక్తివంతమైన కారుగా మార్చనుంది.
2025 స్కోడా ఆక్టావియా AWD హాచ్‌బ్యాక్ మోడల్ లో 0-100 kmph వేగాన్ని కేవలం 6.6 సెకన్లలో చేరుకోనుంది. ఎస్టేట్ వెర్షన్ 6.7 సెకన్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోగలదు. ఈ కార్ గరిష్ఠంగా 228 kmph టాప్ స్పీడ్‌ను అందుకోగలదు. ఈ మోడల్‌లో AWD (ఆల్ వీల్ డ్రైవ్) వ్యవస్థను స్కోడా ప్రవేశపెట్టింది. ఈ AWD సిస్టమ్ ఎలక్ట్రోహైడ్రాలిక్ కంట్రోల్డ్ మల్టీ-ప్లేట్ క్లచ్ ద్వారా పని చేస్తుంది. ఇది డ్రైవింగ్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే సెన్సార్ల సహాయంతో టార్క్ పంపిణీని చేస్తుంది. ఈ సిస్టమ్‌లో EDS, XDS ఎలక్ట్రానిక్ వ్యవస్థలు కూడా పొందుపరచడంతో.. వీటివల్ల టార్క్ ట్రాన్స్‌ఫర్ సామర్థ్యం పెరుగుతుంది. దీనితో డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ AWD సిస్టమ్ వాహన టవింగ్ సామర్థ్యాన్ని 1,900 kg వరకు పెంచింది.
Read Also: Realme 14 5g: రియల్‌మి 14 5g లాంచ్‌కు సిద్ధమంటూ అధికారికంగా పోస్టర్ టీజ్
ఇదివరకు ఈ మోడల్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రశర్శించారు. ఈ కొత్త మోడల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఉన్న స్కోడా కొడియాక్‌ను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది. ఇదివరకు స్కోడా కొడియాక్ మోడల్ రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభించింది. అలాగే ఈ కారు లౌరిన్ & క్లెమెంట్ (L&K) వేరియంట్‌లో అందుబాటులో ఉండేది. ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 187 bhp గరిష్ఠ శక్తిని మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. చూడాలి మరి రాబోయే కొత్త 2025 స్కోడా ఆక్టావియా AWD ఎంతవరకు తన సత్తా చాటగలదో. మొత్తానికి స్కోడా కొడియాక్ కొత్త మోడల్ భారత మార్కెట్‌లో ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అనే ఆసక్తిని పెంచుతోంది.