ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ జెలియో ఎలక్ట్రిక్ మొబిలిటీ దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లిటిల్ గ్రేసీని అధికారికంగా విడుదల చేసింది. స్పెషల్ లుక్, డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర కేవలం రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.
Also Read:Realme 14 5g: రియల్‌మి 14 5g లాంచ్‌కు సిద్ధమంటూ అధికారికంగా పోస్టర్ టీజ్
ఇది తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ కంటే తక్కువ. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ మొత్తం నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ పింక్, బ్రౌన్/క్రీమ్, వైట్/బ్లూ, పసుపు/గ్రీన్ రంగులలో వస్తుంది. ఈ స్కూటర్లను 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు సులభంగా నడపవచ్చని కంపెనీ చెబుతోంది. అంటే ఈ స్కూటర్ స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
Also Read:BV Raghavulu: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ మోసపూరితం.. పవన్ ప్రసంగం విచిత్రంగా ఉంది..!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5kW ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు.ఈ స్కూటర్ 150 కిలోల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇది 60V/30AH సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 90 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ ఖర్చు కిలోమీటరుకు కేవలం 25 పైసలు మాత్రమే అని జెలియో మొబిలిటీ పేర్కొంది.
Also Read:Kishan Reddy: త్రిభాషా పాలసీ కొత్తది కాదు.. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదు
ఎందుకంటే దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 1.5 యూనిట్ల విద్యుత్తు మాత్రమే అవసరం అవుతుంది. అంటే ఈ స్కూటర్‌తో కేవలం 15 రూపాయల ఖర్చుతో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో షాక్ అబ్జార్బర్ సెటప్ ఉన్నాయి. ఈ స్కూటర్‌కు రెండు వైపులా 10-అంగుళాల చక్రాలు, సియట్ టైర్లు అమర్చబడి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్, సెంట్రల్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, రివర్స్ మోడ్, పార్కింగ్ స్విచ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.