Tollywood : ఆ ఇమేజ్‌కు దూరంగా యంగ్ హీరోలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్‌డమ్ సంపాదించాలంటే తప్పనిసరిగా ‘మాస్ ఇమేజ్’ ఉండాలన్న పాత ఫార్ములాను నేటి యువ హీరోలు పక్కన పెడుతున్నారు. మాస్ హీరో అనిపించుకోవడం కంటే, ‘సక్సెస్’ వస్తే చాలు అనే కొత్త మానియాతో వీరు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. యువ హీరోల టీజర్స్, ట్రైలర్స్ పరిశీలిస్తే, ఒకరిద్దరు మినహా చాలామంది మాస్ ఇమేజ్‌కు దూరంగా, కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, యాక్షన్ హీరోలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిన లేదా రొటీన్ ట్రాక్‌లో ఇరుక్కున్న యువ హీరోలు ఇప్పుడు కథా కథనంలో మార్పులు తెస్తున్నారు.
Also Read :Oh Sukumari : ఓ సుకుమారి అంటున్న తిరువీర్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మాస్ ట్రాక్ ఎక్కి పట్టాలు తప్పడంతో, రొటీన్ నుంచి బయటపడాలని ప్రయత్నించాడు నిఖిల్. ఫలితంగా, ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ‘స్వయంభు’ తో ఏకంగా హిస్టరీలోకి వెళ్లిపోయాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతోంది. సక్సెస్ కోసం నిఖిల్ ప్రస్తుతం పీరియాడిక్ మూవీస్ వైపు మొగ్గు చూపుతున్నాడు. అన్న విజయ్ దేవరకొండలా కాకుండా, తమ్ముడు ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ‘బేబి’ తర్వాత, ఆనంద్, వైష్ణవి కాంబోలో ‘ఎపిక్’ అనే సినిమా రాబోతోంది. మాస్ జోలికి పోకుండా కొత్త కథలను ట్రై చేస్తున్న హీరోల్లో ఆనంద్ బెటర్ అని అనిపించుకుంటున్నాడు.
Also Read :Anil Ravipudi : ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి కొత్త ట్రెండ్!
యువ హీరోలు కేవలం యాక్షన్, మాస్ సినిమాలకే పరిమితం కాకుండా, విభిన్న జానర్లను ఎంచుకుంటున్నారు. సుమ, రాజీవ్ కనకాల వారసుడు రోషన్ బబుల్ గమ్ తర్వాత గ్యాప్ తీసుకుని, హీరోగా ‘మోగ్లీ’ చిత్రంతో రాబోతున్నాడు. ‘మోగ్లీ’ ట్రైలర్ విడుదల అయింది. ఇందులో రోషన్ కొంతవరకు యాక్షన్ హీరోగా కనిపింస్తున్నాడు. మరోపక్క హీరో శర్వానంద్ పూర్తిగా సిక్స్ ప్యాక్‌తో గుర్తుపట్టలేనంతగా మారి, ‘బైకర్’ పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ నుంచి బైకర్ పాత్ర వరకు మారడం ఈ ట్రెండ్‌కు నిదర్శనం. హీరో నందు.. అర్జున్ రెడ్డిలా నెగెటివ్ షేడ్‌లో ‘సైక్ సిద్దార్థ్’ గా కనిపించబోతున్నాడు. ఇది కూడా మాస్‌కు దూరంగా, క్యారెక్టర్ డ్రైవెన్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడమే.తెలుగు యువ హీరోలు ఇప్పుడు కేవలం మాస్ ఇమేజ్ కోసం కాకుండా, కథా బలమున్న కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కొత్త రూటే వారికి స్టార్‌డమ్‌ను అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!