Stray Dogs: దేశ రాజధానిలో విషాదం.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dogs: గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు కరిచి చంపేశాయి. రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం. వసంత్‌కుంజ్‌కు సమీపంలోని సింధి క్యాంప్ ఏరియాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా నిరుపేద జనం ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.
ఢిల్లీలోని వసంత్‌కుంజ్ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు.రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్‌పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు.
Also Read
Read Also: Militants Surrender: అరుణాచల్‌లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
అయితే అన్నదమ్ములిద్దరూ మూడు రోజుల వ్యవధిలో వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఆ ఇంట్లో విషాదం నింపింది. గత శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆనంద్‌ను వీధి కుక్కలు కరిచిచంపాయి. ఈ ఘటనను మరువకముందే ఇవాళ మూత్ర విసర్జన చేసేందుకు ఇంటిముందుకు వచ్చిన ఆదిత్యపై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!