Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories 198 Kg Crystal Methamphetamine Drugs Seized In Mumbai

mumbai drugs: రూ.1,476కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న డీఆర్ఐ

Published Date :October 2, 2022 , 2:06 pm
By Rakesh Reddy
mumbai drugs: రూ.1,476కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న డీఆర్ఐ
  • Follow Us :
  • google news
  • dailyhunt

mumbai drugs: మహారాష్ట్ర నవీ ముంబయిలో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆరెంజ్ పండ్ల బాక్సుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్ (ఐస్), 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్, కొకైన్‌లలో ఇదే పెద్ద మొత్తమని చెప్పారు.

Read also: america floods: అమెరికాలో ఇయాన్ బీభత్సం.. 54మంది మృతి

ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. గత 12 రోజులుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. సెప్టెంబర్​ 12న తనిఖీలు చేస్తున్న సమయంలో పండ్ల ట్రక్కులో డ్రగ్స్​ను గుర్తించారు. పండ్ల డబ్బాల్లో డ్రగ్స్​ను దాచిపెట్టి కొత్త విధానంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని.. దిగుమతిదారుడిని పట్టుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అక్రమ రవాణా సూత్రధారుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Read also: ashok gehlot: సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ఇక, క్రిస్టల్ మెథాంఫేటమిన్ అనేది సింథటిక్ డ్రగ్, చాలా అడిక్టివ్. క్రిస్టల్ మెథాంఫేటమిన్ అధిక స్వచ్ఛత స్థాయిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక, తీవ్రమైన శారీరక ప్రభావాలను కలిగి ఉండవచ్చు. ధూమపానం లేదా డ్రగ్‌ను ఇంజెక్ట్ చేసుకునే వారు తీవ్రమైన అనుభూతిని అనుభవిస్తారు. గరిష్టంగా 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆ ప్రభావం ఉంటుంది. ఇక, దక్షిణాఫ్రికా నుంచి వాలెన్సియా ఆరెంజ్‌ల మధ్య డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నారని.. స్మగ్లర్లు ముంబైని ట్రాన్సిట్ పాయింట్‌గా మార్చుకుని యూరప్ దేశాలకు లేదా యుఎస్‌కు సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక, డీఆర్‌ఐ అధికారులు ఇందుకు సంబంధించి దిగుమతిదారుని అరెస్టు చేశారు. అతనిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ రాకెట్‌లో పాల్గొన్న కస్టమ్స్ హౌస్ ఏజెంట్, సిండికేట్ కోసం వెతుకుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crystal methamphetamine
  • DRI
  • Drugs
  • mumbai

తాజావార్తలు

  • అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్‌.. పెళ్లి చేసుకోబోతున్నారా..?

  • Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్

  • Hardik Pandya: “నువ్వు గ్రేట్‌ రా బుడ్డొడా”.. వైభవ్‌ను చూడగానే ఓటమిని మరిచి ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా!

  • Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions