ఈ సంవత్సరం, దసరా నుండి దీపావళి వరకు అన్ని పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. తత్ఫలితంగా, అక్టోబర్ నెల సెలవులతో నిండి పోయింది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీ సెలవులు ఉంటాయని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లైతే ముందుగా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయండం బెటర్. RBI క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో బ్యాంకులు 15 రోజులు మూసివేయబడతాయి. ఇందులో గాంధీ జయంతి, దీపావళి, కొన్ని రాష్ట్ర సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకు సెలవులు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రభావితం చేయదు. డిజిటల్ లావాదేవీలు 24/7 కొనసాగుతాయి. ఈ రోజుల్లో చాలా ATMలలో నగదు డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read:Revanth Reddy : ఫ్యూచర్ సిటీ నా భారీ లక్ష్యం, రాబోయే 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500 కంపెనీలు
అక్టోబర్ 2025 నెలలో బ్యాంకు సెలవులు ఇవే!
అక్టోబర్ 1, బుధవారం: మహా నవమి (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 2, గురువారం: గాంధీ జయంతి / విజయ దశమి (దేశంలోని అని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 5 ఆదివారం: దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 6, సోమవారం: లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 7, మంగళవారం: మహర్షి వాల్మీకి జయంతి (హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 11, శనివారం:(రెండవ శనివారం కారణగం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 12, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 25, శనివారం: ( నాలుగో శనివారం కారణగం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 26 ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 27 సోమవారం: చత్ పూజ (పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 31 శుక్రవారం: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (గుజరాత్లోని బ్యాంకులకు సెలవు)