ద్వీప దేశమైన మడగాస్కర్‌లో గమనే తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాన్ సృష్టించిన ఉగ్రరూపానికి 14 మంది మృత్యువాత పడగా.. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలువురు గల్లంతు కావడంతో పాటు.. ఇంకొందరి ఆచూకీ కూడా లభించనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పలు వంతెనలు కూలిపోయాయి. ఇక తీవ్రమైన వరదలు కారణంగా భారీ నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. 2024లో ఇదే అది పెద్ద తుఫాన్‌గా భావిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mad Max: మాడ్ ఎక్కించడానికి మళ్ళీ వచ్చేస్తున్నారు!
గమనే తుఫాన్ బుధవారం ఉదయం మడగాస్కర్‌లోని ఉత్తర కొనపై ల్యాండ్‌ఫాల్ దగ్గర తీరం వీడింది. గంటకు సుమారు 150 కి.మీ నుంచి 210 కి.మీ వేగంతో గాలులు వీచినట్లుగా తెలుస్తోంది. భారీ ఈదురుగాలులతో పాటు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం బాగా జరిగినట్లుగా మడగాస్కర్ నేషనల్ ఆఫీస్ ఫర్ రిస్క్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గురువారం తెలిపింది.
ఇది కూడా చదవండి: RR vs DC: అంఫైర్తో పాంటింగ్, గంగూలీ వాగ్వాదం.. కాసేపు ఆగిన మ్యాచ్.. ఇంతకీ ఏమైందంటే..!
దేశంలోని ఏడు ప్రాంతాలు ధ్వంసం అయినట్లుగా సమాచారం. పెద్ద ఎత్తున ఇళ్ల ధ్వంసం అయ్యాయి. మరికొన్ని ప్రాంతాలు చెట్లు కూలి చెల్లాచెదురయ్యాయి. ఇంకొన్ని ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారు. ఇక భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీటి మునిగాయి. అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించినట్లుగా విపత్తు నిర్వహణ కార్యాలయం తెలిపింది.
