ద్వీప దేశమైన మడగాస్కర్‌లో గమనే తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాన్ సృష్టించిన ఉగ్రరూపానికి 14 మంది మృత్యువాత పడగా.. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గల గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో జరిగిన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు.