బాలీవుడ్ లో గతేడాది విడుదల అయి సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్. ఈ చిత్రాన్ని వినోద్ చోప్రా తెరకెక్కించారు..ఇప్పటికే రచయిత గా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్, సంజూలాంటి సినిమాలు అందించిన విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా..ఇప్పుడు ఐఎండీబీ లో అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా గా నిలిచింది.12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ ప్రధాన పాత్ర లో కనిపించాడు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితా లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఐఎండీబీలో పదికి 9.2 రేటింగ్ తో 12th ఫెయిల్ మూవీ టాప్ ప్లేస్ సాధించింది.ఈ లిస్ట్ టాప్ 5 లో 1993 లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్ మరియు మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి.
కేవలం రూ.20 కోట్ల బడ్డెట్ తో తెరకెక్కిన ఈ 12th ఫెయిల్ మూవీ.. ప్రపంచవ్యాప్తం గా దాదాపు రూ.66 కోట్లు వసూలు చేసింది. గతేడాది అక్టోబర్ 27 న రిలీజైన ఈ సినిమా కు మొదట్లో పెద్దగా ఆదరణ లభించకపోయినా.. తర్వాత ఈ మూవీ అత్యధిక ప్రేక్షకాదరణ పొందింది..ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చివరికి ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది.గతేడాది హాలీవుడ్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్, ఓపెన్‌హైర్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ మరియు జాన్ విక్ చాప్టర్ 4లాంటి సినిమాల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్ మూవీ సొంతం చేసుకుంది.12th ఫెయిల్ మూవీ ఓ సక్సెస్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ బయోగ్రఫీ.అత్యంత పేదరికం నుంచి వచ్చిన ఆయన చివరికి దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు.. ఆయనపై అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్నే ఇప్పుడు 12th ఫెయిల్ పేరుతో విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించాడు