Helicopter Ride: విద్యార్థులకు ఇచ్చిన హామీని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలబెట్టుకున్నారు. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉచిత హెలికాప్టర్ రైడ్ అవకాశాన్ని కల్పించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వారిని ఉచితంగా గగనవిహారం చేయించడంతో విద్యార్థుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మొదటిసారిగా గాల్లో ప్రయాణించామని, చాలా సంతోషంగా ఉందంటూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన 10 మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని మే నెలలో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. విద్యార్థులను ప్రోత్సాహం అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Washington : అక్కడ తినడమే అతను చేసిన నేరం.. అందుకే ఫైరింగ్
ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. 12వ తరగతి బోర్డు పరీక్షలో రాయ్‌పూర్‌లో మొదటి ర్యాంకు, ఛత్తీస్‌గఢ్‌లో 10వ ర్యాంకు సాధించిన రాయ్‌పూర్‌కు చెందిన వర్షా దేవాంగన్ కృతజ్ఞతలు తెలుపుతూ, రైడ్‌లో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని, దీంతో ఒక కల నిజమైందని అన్నారు. తాను హెలికాప్టర్లో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని.. ఇది చిరస్మరణీయమైన క్షణమని.. తమ ప్రాంతంలో సరైన రోడ్డు కనెక్టివెటీ, ఇతర సౌకర్యాలు కూడా లేవని 10వ తరగతి విద్యార్థి దేవానంద్ కమేటి చెప్పాడు.
𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁
देखिए, बच्चे कितने खुश हैं!
हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे।
आज इसकी शुरुआत हो गयी है।
कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022