Delhi Fire Accident: ఢిల్లీలో పేయింట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇప్పటి వరకు 11 మంది సజీవదహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: ఢిల్లీలోని అలీపూర్ ఏరియాలోని ఓ పేయింట్ ఫ్యాక్టరీలో గురువారం నాడు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో 11 మంది కాలిపోయిన మృతదేహాలను అగ్నిమాపక శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Read Also: GSLV F14 Launch: రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–14 ప్రయోగం.. నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్
Also Read
కాగా, నిన్న సాయంత్రం 5.25 గంటలకు మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అక్కడికి 22 ఫైరింజన్లతో వెళ్లి మంటలు అదుపులోనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు.
Read Also: Autos Strike Today: నేడు ఆటోలు బంద్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ఇక, మృతుల్లో ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు అని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఉంచిన కెమికల్ డ్రమ్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.. దీంతో లోపల ఉన్న కార్మికులు బయటకు రాలేకపోవడంతోనే మరణించినట్లు చెప్పుకొచ్చారు. ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!