100 Days Special Poster for Sarkaru Vaari Paata Movie
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, ‘జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే.. ఈ సినిమాకు.. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. అయితే.. ఈ సినిమాలు మే 12వ తేదీని విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే.. తాజాగా ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోను .. విశాఖ జిల్లా గోపాలపట్నంలోను రోజుకి 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకున్న నేపథ్యంలో సర్కారు వారి పాట టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో మహేశ్‌బాబు-కీర్తి సురేష్‌ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకుల కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా.. విలన్‌గా సముద్రఖని మెప్పించారు. ఇవే కాకుండా.. ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో సాంగ్స్ ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి.