SABARI: చంద్రబోస్ చేతుల మీదుగా శబరి సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘అనగనగా ఒక కథలా…’ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.
‘అనగనగా ఒక కథలా…’ పాటకు సుచిత్రా చంద్రబోస్ నృత్య రీతులు సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ… ”ఇప్పుడే నేను ‘శబరి’ సినిమాలోని ‘అనగనగా ఒక కథలా…’ పాటను విడుదల చేశా. గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు. నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు… పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించా. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ… ”నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. ‘శబరి’ సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్రనాథ్ గారికి థాంక్స్” అని చెప్పారు.బిడ్డ మీద తల్లి ప్రేమ ఎప్పటికీ కరగదని చెప్పే గీతం ‘అనగనగా ఒక కథలా’. తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది. చిన్నారి పిలుపునకు బదులు తల్లి, చిన్నారి అడుగులకు గొడుగు తల్లి, చిన్నారి కలలకు రంగులు తల్లి అంటూ కన్నపేగుతో అమ్మకు ఉండే బంధాన్ని రెహమాన్ అద్భుతంగా రాయగా… చిత్ర గాత్రం ఆ పాటలో భావం ప్రేక్షకులకు చేరువ అయ్యేలా అంతే గొప్పగా పాడారు.
”అనగనగా ఒక కథలా
ఓ చందమామా
కడవరకు కరగదులే
ఈ అమ్మ ప్రేమ
పిలుపులు నీవైతే
బదులును నేనౌతూ
ఎదురుగ ఉంటాలే కదలక
అడుగులు నీవైతే
గొడుగును నేనౌతూ
చకచక వస్తాలే వదలక..అనగనగా
తడబడుతూనే నిలబడుతుంటే
కళ్లకు ఆనందమే
గడపను దాటి కదిలితే నువ్వు
గుండెకు ఆరాటమే
నువ్వేకదా ప్రపంచం
నువ్వంటే నా సంతోషం”అంటూ సాగిందీ గీతం. శబరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!