నిర్లక్ష్యం కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంటుంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్‌లో జరిగిన సంఘటనే ఉదాహరణ. పిట్టగోడ దగ్గర నిలబడిన వ్యక్తి అమాంతంగా రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bunny Vasu: అల్లు అరవింద్ పుట్టిన తర్వాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు.!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 25 ఏళ్ల నజీర్ అనే యువకుడు రెండంతస్తుల బిల్డింగ్‌పై పనుల్లో నిమగ్నమైయున్నాడు. ఇంతలో వాటర్ తాగుతూ బాల్కనీ దగ్గరకు వచ్చాడు. పిట్టగోడకు ఆనుకుని తాగే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. పిట్టగోడ చిన్నదిగా ఉండడంతో బ్యాలెన్స్ చేసుకోలేక అమాంతంగా కిందపడిపోయాడు. కింద స్కూటర్ పార్కు చేసి ఉండడంతో దాని మీద పడ్డాడు. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కాపాడారు. స్కూటర్ మీద పడడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
నజీర్‌కు ఒక కాలు విరిగిపోయిందని.. అలాగే శరీరంలో తీవ్రగాయాలైనట్లు సమాచారం. నజీర్ పాన్ షాప్, టెక్స్టైల్ స్టోర్ ఉన్న భవనంపై పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 9న సాయంత్రం 4: 30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే గురువారం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఇలాంటి పిట్టగోడల దగ్గర పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే పిట్టగోడలు మరింత ఎత్తుగా నిర్మించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో తర్వాతైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Rajasthan: Horrific incident: A man accidentally fell from the upper floor of building.#rajasthan #jodhpur #newskarnataka pic.twitter.com/8AUS77jW4B
— News Karnataka (@Newskarnataka) September 14, 2025