Site icon NTV Telugu

JP Nadda: ఐటీ రైడ్స్‌లో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్లు.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి…

It Raids

It Raids

JP Nadda: భారతదేశంలో జరిగిన ఐటీ రైడ్స్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డబ్బులు బయటపడుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసాల్లో బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 290 కోట్ల నగదు బయటపడింది. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ..‘‘ మిత్రమా మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఇది న్యూ ఇండియా, రాజకుటుంబాల పేరుతో దోపిడి చేయడాన్ని ప్రజలు అనుమతించరు. మీరు పరిగెత్తడంలో విసిగిపోతారు, చట్టం మిమ్మల్ని విడిచిపెట్టదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి

కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే.. అవినీతిపై చర్యలు తీసుకుంటామని, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రతీ పైసా వాసస్ ఇవ్వాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉంటోంది.

సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ఈ వ్యవహారానికి పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఎంపీ ధీరజ్ సాహూ వ్యాపారాలతో ఏ సంబంధం లేదని చెప్పారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌కి ఏటీఎంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒడిశా బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా ఈ పన్ను ఎగవేత సాధ్యం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మహాపాత్ర అన్నారు.

Exit mobile version