Darshan Case: స్టార్ హీరో దర్శన్ అరెస్ట్‌పై స్పందించిన నటి రమ్య.. ఏమన్నారంటే..
- చర్చనీయాంశంగా మారిన స్టార్ హీరో దర్శన్ వ్యవహారం..
- అభిమాని హత్య కేసులో అరెస్ట్..
- చట్టానికి అతీతులు కారన్న నటి రమ్య..
- దర్శన్‌కి మద్దతుగా సంజనా గల్రానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్, రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ కావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఎంతో ముద్దుగా ‘డి బాస్’ , ‘ఛాలెంజింగ్ స్టార్’గా పిలుచుకునే దర్శన్ అరెస్ట్ కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఓ అభిమానిని చంపినందుకు అతడిని కఠినంగా శిక్షించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. దర్శన్‌ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని, అతడి సినిమాలు విడుదల చేయొద్దని మృతుడు రేణుకాస్వామి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
దర్శన్ అప్పటికే పెళ్లైనప్పటికీ, పవిత్ర గౌడ అనే సహనటితో సహజీవనం చేస్తున్నాడు. తన అభిమాన హీరో సంసారాన్ని నాశనం చేశావంటూ రేణుకాస్వామి తరుచుగా పవిత్ర గౌడ సోషల్ మీడియాకు అసభ్యకరమైన మెసేజులు పెట్టడం హత్యకు కారణంగా తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన స్వామిని బెంగళూర్ రప్పించి, దర్శన్, అతని సన్నిహితులు తీవ్రంగా దాడి చేయడంతో దెబ్బలకు తాళలేక మరణించాడు. డెడ్ బాడీని డ్రైనేజీలో పారేశారు. అయితే, ముందుగా ఆత్మహత్య అని భావించినప్పటికీ, పోలీసులు విచారిస్తున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో దర్శన్, పవిత్రలతో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Read Also: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు..
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన(రమ్య) స్పందించారు. ‘‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు” అని అన్నారు. “ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. మీరు ప్రజలను కొట్టడం మరియు చంపడం వంటివి చేయవద్దు. న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా లేదా అనేదానికి ఒక సాధారణ ఫిర్యాదు సరిపోతుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటక పోలీసులపై ప్రశంసలు కురిపించారు. రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగిపోరని, చట్టంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిసతున్నారని రాసుకొచ్చారు. జస్టిస్ ఫర్ రేణుకాస్వామి, అని పోస్టును ముగించారు.
ఆమె దర్శన్‌తో పాటు మాజీ సీఎం యడియూరప్పపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ప్రస్తావించారు. ఇదే కాకుండా ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారాన్ని టచ్ చేశారు. మరోవైపు దర్శన్ సహనటి సంజనా గల్రానీ దర్శన్‌కి మద్దతుగా నిలిచారు. “ఇది నిన్న మాకు బ్లాక్ డే, మరియు ఇది కన్నడ పరిశ్రమకు వినాశనం లాంటిది. అతను కన్నడ పరిశ్రమలో ఆయన అభిమాన నటుడు’’ అని చెప్పారు. అతడి అరెస్ట్ కన్నడ పరిశ్రమకు అంతిమ రోజుగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!