Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్, రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ కావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఎంతో ముద్దుగా ‘డి బాస్’ , ‘ఛాలెంజింగ్ స్టార్’గా పిలుచుకునే దర్శన్ అరెస్ట్ కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.