కేంద్ర మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. శీతాకాల సమావేశాలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్‌లో ఆమోదించారు. తాజాగా ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించేం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేడు లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టాల బిల్లు 2021 ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త ఓటర్ల గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌ను వినియోగించటం, ఆధార్ నెంబర్ ఇవ్వకపోయినా ఓటు వేసేలా సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఇదిలా ఉంటే నేడు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై చర్చించేందుకు రావాలని నాలుగు పార్టీలకు లేఖలు పంపడంతో చర్చను విపక్షాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను తిరస్కరించాలని విపక్షాలు పార్లమెంట్‌లో ఉమ్మడిగా డిమాండ్ చేయనున్నాయి.