Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్‌దే..
- పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్..
- దేశ విభజన పాపం కాంగ్రెస్ పార్టీదే..
- విరుచుకుపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు’’ అని అన్నారు.
Read Also: Karnataka: పాలస్తీనా జెండాలతో హల్చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ వంటిదని అన్నారు. దానికి చికిత్స చేసేంత వరకు భారత సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. ‘‘ప్రస్తుతం పీఓకే స్వేచ్ఛగా ఉండాలని మళ్లీ భారతదేశంలో కలవాలని డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్, దీనికి సకాలంలో చికిత్స చేయడానికి ప్రపంచం కలిసి రావాలి’’ అని అన్నారు.
1947లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారు భారతదేశాన్ని విభజించాలని కోరుకునే ముస్లింలీగ్‌కి మద్దతు ఇచ్చారని, దీంతోనే పాకిస్తాన్ పుట్టిందని అన్నారు. 1905లో బెంగాల్ విభజించడానికి బ్రిటీష్ ప్రయత్నాలను ప్రస్తావించారు. ఇది ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకున్నామని, ముస్లిం లీగ్‌పై ఇదే విధంగా వ్యతిరేకత చూపిస్తే పాకిస్తాన్ సృష్టిని నిరోధించి ఉండేవాళ్లమని అన్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ఇటీవల అశాంతిపై యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదని, దీనికి బాధ్యులెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, తిప్రమోతా అధినేత ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బర్మ కూడా పాల్గొన్నారు.
पाकिस्तान 'नासूर' है, ये मानवता का 'कैंसर' है…
इसका उपचार समय रहते दुनिया की ताकतों को मिलकर करना होगा… pic.twitter.com/SvJnE3VrcI
— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!