Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- చాట్ జీపీటీలో అంతరాయం
- చాట్ జీపీటీ, క్లాడ్, గ్రోక్లో తీవ్ర అంతరాయం
- ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చాట్ జీపీటీ, క్లాడ్, గ్రోక్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 8:30 గంటల నుంచి పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిరాశ, నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు వెంటనే రంగంలోకి దిగి సేవలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అంతరాయాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
ప్రముఖ జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు అంతరాయం ఏర్పడింది. OpenAIకి చెందిన ChatGPT, Anthropicకు చెందిన Claude, xAIకి చెందిన Grok సేవలను వినియోగించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని వేలాది మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. సేవలలో ఏర్పడిన అంతరాయానికి గల కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. యూజర్లు సమస్యలను నివేదిస్తుండటంతో ఈ అంతరాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ChatGPT, Claude, Grokకు సమస్యలు
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు చాట్ జీపీటీ, క్లాడ్, గ్రోక్ సేవలను యాక్సెస్ చేయడంలో, ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 8.30 గంటల సమయానికి భారత్‌లోనే చాట్ జీపీటీకు సంబంధించి 2,800కు పైగా, క్లాడ్పై 170కు పైగా, గ్రోక్‌పై 70కు పైగా సమస్యల నివేదికలు నమోదయ్యాయి. అమెరికాలో కూడా పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. అదే సమయంలో ChatGPTపై 35,000కు పైగా, Claudeపై 1,400కు పైగా, Grokపై 1,200కు పైగా సమస్యల నివేదికలు నమోదైనట్లు Downdetector వెల్లడించింది.
ఎర్రర్ మెసేజ్‌లు.. స్పందించని ఏఐ సేవలు
యూజర్లు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. సేవలను యాక్సెస్ చేయలేకపోవడం, ఎర్రర్ మెసేజ్‌లు రావడం, ప్రశ్నలకు ఏఐ నుంచి స్పందనలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. యూజర్లు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా Downdetector సేవల అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. సాధారణ స్థాయితో పోలిస్తే ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగితే.. అది సర్వీస్ అవుటేజ్ లేదా సాంకేతిక సమస్యకు సంకేతంగా పరిగణిస్తారు.
ChatGPTపై OpenAI ఏం చెప్పింది?
OpenAI స్టేటస్ పేజీలో కూడా గురువారం ChatGPT Work Modeకు సంబంధించిన సమస్య నమోదైంది. ఈ సమస్య కారణంగా ఎర్రర్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అనంతరం ఈ సమస్య పరిష్కరించినట్లు స్టేటస్ పేజీలో పేర్కొంది.
Claudeలోనూ అధిక ఎర్రర్లు
Anthropic స్టేటస్ పేజీలో కూడా గురువారం Claude మోడళ్లకు సంబంధించిన సమస్యలు కనిపించాయి. పలు Claude మోడళ్లను ప్రభావితం చేస్తున్న అధిక ఎర్రర్లకు కారణాన్ని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. సమస్యకు పరిష్కారం కోసం పని చేస్తున్నామని Anthropic వెల్లడించింది. ఒకేసారి ChatGPT, Claude, Grok వంటి ప్రముఖ ఏఐ సేవలకు యూజర్లు సమస్యలను నివేదించడం ఆసక్తికరంగా మారింది. అయితే మూడు ప్లాట్‌ఫామ్‌లలోనూ ఒకేసారి సమస్యలు ఎందుకు తలెత్తాయన్నది వెంటనే స్పష్టంగా తెలియలేదు. సేవల పరిస్థితిని ఆయా సంస్థలు, అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్‌లు పరిశీలిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు