Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- రష్య చమురు కొనుగోళ్లపై ఉక్రెయిన్కు జైశంకర్ క్లారిటీ..
- 140 కోట్ల మంది ప్రజల అవసరాలే ముఖ్యమని స్పష్టం..
- చమురు కొనుగోళ్లపై యుద్ధం ముగింపు ఆధారపడదు..
- దౌత్య, చర్యలే యుద్ధానికి పరిష్కారం, ఆ దిశగా భారత్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar in Kyiv: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని వెస్ట్రన్ దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. అయితే, ఈ ఆందోళనపై ఉక్రెయిన్ గడ్డపై నుంచే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని కీవ్లో గురువారం మాట్లాడిన ఆయన.. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత భారత్కు ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన పరిస్థితులు ప్రస్తుతం క్లిష్టంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన ఇంధన అవసరాలను విస్మరించలేదని అన్నారు. ఉక్రెయిన్ అభిప్రాయాలను భారత్ గౌరవిస్తుందని, ఇదే విధంగా భారత్ దృక్కోణాన్ని కూడా గౌరవించాలని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలకు ఇంధనం అందించాల్సిన విషయంలో సవాళ్లను అందరూ అర్థం చేసుకోవాలని జైశంకర్ అన్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే యుద్ధం కొనసాగుతుందన్న వాదనల్ని జైశంకర్ తోసిపుచ్చారు. చమురు, అల్యుమినియం, ఖనిజాలు, లోహాలు ఎవరు కొనుగోలు చేస్తున్నారు.? ఎవరు కొనుగోలు చేయడం లేదు? అనే అంశంపై యుద్ధం ముగియదని అన్నారు. తాజా పరిస్థితుల్లో రష్యా-ఉక్రెయిన్ పరిష్కారం సైనిక మార్గంలో కాకుండా దౌత్యం, చర్చల వల్లే పరిష్కారమవుతుందని అన్నారు. ఈ దిశగా ప్రయత్నాలకు భారత్ సహకరించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో జైశంకర్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రియ్ సిబిహాతో కూడా ఆయన చర్చలు జరిపారు. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. బ్లాక్ సీలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల అంశాన్ని భారత్ ప్రస్తావించింది. యుద్ధం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరాపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు.
JAISHANKAR ON RUSSIAN OIL
S Jaishankar responds to a Ukraine journalist asking if India will keep buying Russian oil:
“This conflict will not be solved because somebody is buying or not buying oil, minerals or metals. It will be solved by dialogue, diplomacy and negotiation.”…
— Subodh Kumar (@kumarsubodh_) September 3, 2026
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..