Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ
- యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- భారత్ జోక్యం చేసుకుంటుందని మోడీ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు, నల్ల సముద్ర భద్రతపై చర్చించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన సంభాషణలో సంఘర్షణను ముగించే ప్రయత్నాలకు సహకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ తెలియజేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఉక్రెయిన్‌లో జైశంకర్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నల్ల సముద్రంలో పౌర నౌకాయాన భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడానికి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. సముద్ర మార్గాలకు ఉన్న ముప్పుల గురించి ఇరుపక్షాలు చర్చించాయని, ఆ మార్గాలపై ఆధారపడిన ప్రాంతాలకు ఆహార సరఫరాను నిరోధించడం ఆమోదయోగ్యం కాదని వాదించినట్లు జెలెన్స్కీ తెలిపారు.
Also Read
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ఇరాన్ సహాయంతో రష్యా ఉక్రెయిన్‌పై జెట్-పవర్డ్ షాహెద్ డ్రోన్లను ప్రయోగించిందని జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధ విమానాలు చాలా డ్రోన్లను అడ్డుకున్నాయని అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలపై కీవ్‌లో జైశంకర్ చర్చలు దృష్టి సారించిన తరుణంలో ఈ ఆరోపణ వచ్చింది. మరోవైపు సముద్ర భద్రత, తమ భూభాగంపై దాడులు వంటి అంశాలపై మరింత బలమైన వైఖరి తీసుకోవాలని ఉక్రెయిన్ అంతర్జాతీయ భాగస్వాములపై ఒత్తిడి కొనసాగిస్తోంది. ఈ సంఘర్షణపై స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని, భద్రతను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని జెలెన్స్కీ ఇతర దేశాలకు పిలుపునిచ్చారు.
I met with India’s Minister of External Affairs @DrSJaishankar. We discussed important issues. We are grateful to India for its commitment to ending this unjust war – Russia’s war against Ukraine. This certainly must not be a time of war. Peace is needed. This is India’s clear… pic.twitter.com/ZJ4IRP7Qpx
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 3, 2026
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!