Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Yogi Adityanath Plans To Rename Mustafabad As Kabirdham To Honor Sant Kabir

Yogi Adityanath: సీఎం యోగి కీలక నిర్ణయం.. ముస్తఫాబాద్ పేరు ఇక..

Published Date :October 28, 2025 , 8:42 pm
By Venu Goapl Reddy
  • కీలక నిర్ణయం తీసుకున్న సీఎం యోగి..
  • ముస్తఫాబాద్ పేరు కబీర్‌ధామ్‌గా మార్పు..
Yogi Adityanath: సీఎం యోగి కీలక నిర్ణయం.. ముస్తఫాబాద్ పేరు ఇక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామ పేరును ‘‘కబీర్ ధామ్’’గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు. కొత్త పేరు సంత్ కబీర్‌తో ఈ ప్రాంతం చారిత్రక-సాంస్కృతిక అనుబంధాన్ని పునరుజ్జీవింపజేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “స్మృతి మహోత్సవ్ మేళా 2025”లో సీఎం దీనిని ప్రకటించారు. ముస్తఫాబాద్ అనే పేరు ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఒక్క ముస్లిం నివాసితుడు లేకపోవడంపై యోగి ఆశ్చర్యాన్ని వ్యక్తి చేశారు.

Read Also: Montha Cyclone Effect: తీరాన్ని తాకిన ‘మొంథా’ తుఫాన్.. అక్కడ 8:30 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత..

సభలో యోగి మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రామం గురించి నేను అడిగినప్పుడు, దాని పేరు ముస్తఫాబాద్ అని నాకు చెప్పారు. ఇక్కడ ఎంత మంది ముస్లింలు నివసిస్తున్నారని నేను అడిగాను మరియు ఎవరూ లేరని నాకు చెప్పారు. అప్పుడు పేరు మార్చాలని చెప్పాను. దీనిని కబీర్‌ధామ్ అని పిలవాలి’’ అని చెప్పారు. ‘‘గతంలో పాలించిన వారు అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా, కబీర్ ధామ్‌ను ముస్తఫాబాద్‌గా మార్చారు. మా ప్రభుత్వం దానిని తిప్పికొడుతోంది.’’ అని అన్నారు. ప్రతీ తీర్థయాత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దుతామని యోగి హామీ ఇచ్చారు. కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిషారణ్య, మధుర-బృందావన్, బర్సానా, గోకుల్ ఇలా ప్రతీ ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం బీజేపీ పరిపాలనలో ప్రజా నిధులు వినియోగం మారిందని చెప్పారు. గతంలో ప్రజల డబ్బుతో కబ్రస్థాన్(స్మశాన వాటికలు) సరిహద్దు గోడలు నిర్మించేందుకు ఉపయోగించేవారని, ఇప్పుడు మన విశ్వాస కేంద్రాలు, వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నామని అన్నారు. మన నాగరికత గుర్తింపు, పునరుజ్జీవనం, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ప్రదేశాల వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • cultural heritage
  • Kabirdham
  • Mustafabad rename
  • name change politics

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions