Gujarat: కంత్రీ ఖైదీ.. మొబైల్ ఎక్కడ దాచాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- గుజరాత్ జైల్లో షాకింగ్ ఘటన
- దొంగచాటగా ఖైదీ మొబైల్ వాడకం
- ఫోన్ కనుగొన్న తీరు చూసి అధికారుల షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలు అంటే కట్టుదిట్టమైన భద్రత. నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. బయట వారిని లోపలికి పంపించరు. చాలా పగడ్బందీగా జైలు పరిసరాలు ఉంటాయి. అలాంటిది ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన తీరు చూసి మరింత అవాక్కయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జైల్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: West Bengal: 61 రోజుల్లో నిందితుడికి మరణశిక్ష.. బాలిక హత్యాచారం కేసులో సంచలనం..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
రవి బరయ్య(33) అనే ఖైదీ పోక్సో కేసులో అక్టోబర్ 19, 2024 నుంచి గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా జైల్లో ఉంటున్నాడు. జైలు లోపల మొబైల్ వాడకం ఉండదు. డిసెంబర్ 4న (గురువారం) సాయంత్రం స్థానిక దర్యాప్తు బృందం జైలు ఆవరణలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో జైలు సర్కిల్ సెక్షన్‌లో మొబైల్ ఫోన్ ఛార్జర్‌ని గుర్తించారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. మొబైల్ ఛార్జర్ ఎలా వచ్చిందని ఖైదీలను ఆరా తీశారు. కానీ ఎవరు నుంచి సమాధానం దొరకలేదు. అయితే రవి బరయ్యపై అనుమానం వచ్చింది. కానీ అతడి వస్తువులను పరిశీలించినా ఎక్కడ ఆనవాళ్లు దొరకలేదు. అయినా అతడిపై అనుమానం తగ్గలేదు.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించారు. స్కానింగ్‌లో మల ద్వారంలో మొబైల్ ఉన్నట్లుగా బయటపడింది. దీంతో ఎక్స్-రేను చూసి అధికారులు షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Volkswagen Cars: కారు కొనేవారికి శుభవార్త.. ఈ కారుపై భారీ తగ్గింపు ధరలు
ఈ ఘటనపై భావ్‌నగర్ జిల్లా జైలు ఇంచార్జ్ జైలర్ విష్ణుజీ వాఘేలా నీలం బాగ్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 223 మరియు ఖైదీల చట్టంలోని సెక్షన్ 42, 43, మరియు 45(12)లను ఉదహరించారు. వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం స్థానిక దర్యాప్తు బృందం జైలు ఆవరణలో సోదాలు నిర్వహించారని.. సెర్చ్‌లో జైలు సర్కిల్ సెక్షన్‌లో మొబైల్ ఫోన్ ఛార్జర్‌ని గుర్తించినట్లు తెలిపారు. బ్యారక్‌లోని ఖైదీలందరినీ విచారించగా రవి బరయ్య తీరు అనుమానాలకు తావించిందన్నారు. క్షుణ్ణంగా పరిశీలించినా ఎటువంటి నిషిద్ధ వస్తువులు దొరకలేదన్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు జైలు అధికారులు బారయ్య పురీషనాళంలో ఏదో దాచి ఉండొచ్చని అనుమానించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల నిమిత్తం బారయ్యను భావ్‌నగర్‌లోని సర్తీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో నిర్వహించిన ఎక్స్-రేలో అతని మల కుహరంలో మొబైల్ ఫోన్ దాగి ఉన్నట్లు బయటపడింది. అనంతరం ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మొబైల్ ఫోన్, ఛార్జర్ జైలులోకి ఎలా వచ్చింది. బారయ్య ఎంతకాలంగా ఫోన్ ఉపయోగిస్తున్నాడు అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి: Pragya Nagra leaked Video: టాలీవుడ్ హీరోయిన్ వీడియోలు లీక్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!