World's Highest Railway Bridge: రెండు దశాబ్ధాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నెలవేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ గా, ఇంజనీరింగ్ అధ్భుతంగా కొనియాడుతున్న చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలో ఎతైన రైల్వే వంతెన 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది.