Women Reservation: సారీ మహిళ.. లోక్‌సభలో వీగిపోయిన బిల్లు..

  • మహిళా బిల్లుకు బ్రేక్..
  • వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు..
Parliament

Parliament

Women Reservation: లోక్‌సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం వీగిపోయింది. మొత్తం 528 సభ్యులు ఓటింగ్ చేస్తే ఇందులో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓట్ చేశారు. దీంతో 2/3 వంతు మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు పాస్ కావాలంటే కావాల్సిన బలాన్ని ఎన్డీయే సర్కార్ సంపాదించలేకపోయింది. బిల్లు ఆమోదానికి 326 ఓట్లు అవసరం. శాసనసభలలో మహిళా కోటా అమలుకు కీలకమైన నిబంధన అయిన నియోజకవర్గాల పునర్విభజన కోసం కొత్త జనాభా గణన అవసరాన్ని తప్పించుకోవడమే ఈ బిల్లు లక్ష్యం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.

Read Also: Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్

కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మంగా ఈ బిల్లు్ల్ని భావించింది. డివిజన్ ఓటింగ్ ద్వారా ఎంపీలంతా తమ ఓటును వినియోగించుకున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఉండటంతో సభలో 2/3 వంతు సభ్యులు ఆమోదం తప్పనిసరి అయ్యింది. అయితే, విపక్షాలు మాత్రం బిల్లుకు ఏ మాత్రం సహకరించలేదు. ఈ బిల్లును ఓడిస్తామని అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్రం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుందని ఆరోపించారు. 850కి లోక్‌సభ సీట్లను పెంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.