Women Reservation Bill: మహిళా కోటాలో సొంత స్థానాలు కోల్పోయే కేంద్రమంత్రులు వీళ్లే!
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఈ కేంద్రమంత్రులకు ఇక్కట్లు
- సొంత స్థానాలు కోల్పోనున్న సీనియర్ నాయకులు
- రాజకీయ విశ్లేషకులు అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలక సంస్కరణలు చేసే దిశగా వెళ్తోంది. మహిళలకు పెద్దపీట వేస్తూ సంచలన బిల్లును లోక్‌సభలోకి తీసుకురాబోతుంది. నారీమణులకు ఇదొక శుభపరిణామం. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బిల్లులు ఆమోదించనుంది.
ఇక దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే లోక్‌సభలో రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మహిళా ఓటర్ల శాతం ఆధారంగా నియోజకవర్గాలను రిజర్వ్ చేయాల్సి వస్తే కేంద్రంలో ఉన్న పలువురు అగ్ర నాయకులంతా తమ స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్

ఈ కోవలో కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ వంటి ప్రముఖులు తమ నియోజకవర్గాలను కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం.. లోక్‌సభలో 181 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. వాటిలో కేవలం 26 స్థానాల్లోనే మహిళా ఎంపీలు ఉన్నారు. మిగతా 155 స్థానాల్లో కొత్త మార్పులు రానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ (రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం), లక్నో (రాజ్‌నాథ్ సింగ్), అమేథీ వంటి నియోజకవర్గాలు మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండడంతో ఈ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశముంది.
మహారాష్ట్రలో నాగ్‌పూర్ నియోజకవర్గం (నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం) కూడా మహిళా రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అనురాగ్ ఠాకూర్ (హమీర్పూర్), హెచ్డి కుమారస్వామి (మాండ్య), జితన్ రామ్ మాంఝీ (గయా), చంద్రశేఖర్ పెమ్మసాని (గుంటూరు), గౌరవ్ గొగోయ్ (జోర్హాట్), కళ్యాణ్ బెనర్జీ (శ్రీరాంపూర్) మరియు కీర్తి ఆజాద్ (బర్ధమాన్-దుర్గాపూర్) వరుసలో ఉన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు లాభం?
మహిళా ఓటర్ల శాతం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటంతో ఈ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!