Delhi Metro Rail: మెట్రోరైలులో సీటు కోసం గొడవ.. కోపంలో మహిళ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Uses Pepper Spray On Co-Passenger After Argument Escalates In Delhi Metro: ఆ మెట్రో రైలు చాలావరకు ఖాళీగానే ఉంది. కూర్చోవడానికి సీట్లు కూడా ఉన్నాయి. అయినా సరే.. ఆ ఇద్దరు మహిళలు మాత్రం సీటు విషయంలో గొడవ పడ్డారు. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. కోపంలో ఒక మహిళ తనతో వాగ్వాదానికి దిగిన మహిళపై పెప్పర్ స్ర్పే కొట్టింది. ఈ ఘటన ఢిల్లీలోని మెట్రో రైలులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదు
Also Read
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
మెట్రో రైలులో ఒకే వరుసలో ఇద్దరు మహిళలు పక్కపక్కనే కూర్చున్నారు. వీళ్లిద్దరికీ సౌకర్యవంతంగా కూర్చోవడానికి అక్కడ ప్లేస్ ఉంది. కానీ.. ఎక్కడ చెడిందో తెలీదు కానీ, సీటు విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మనం ఆ వీడియోలో చూస్తే.. ట్రైన్ దాదాపు ఖాళీగా ఉంది. సీట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. అంతెందుకు.. ఏ సీటు కోసమైతే ఆ మహిళలు గొడవపడ్డారో, అక్కడ ఇద్దరి మధ్య జాగా బాగానే ఉంది. అయినా ఎందుకో సీటు కోసం ఈ ఇద్దరు శివాలెత్తారు. బూతులు తిట్టేసుకున్నారు. ఒక మహిళ అయితే.. ‘ఇంకో మాట మాట్లాడితే నా చేతి దెబ్బ రుచి చూస్తావ్’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నాకే వార్నింగ్ ఇస్తావా? అంటూ ఇంకో మరో మహిళ.. ‘నీలాంటి వాళ్ల కోసమే నేను పెప్పర్ స్ర్పే పెట్టుకున్నా, ఇప్పుడే ఉండు, నీ ముఖంపై కొడతా’ అంటూ పెప్పర్ స్ర్పే తీసింది.
PBKS vs RR: శివాలెత్తిన శిఖర్ ధవన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
ప్రయాణికురాలు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ మహిళ మాత్రం వినలేదు. ఎలాగో బయటకు తీసింది కాబట్టి.. దాని మూత విప్పి స్ర్పే చల్లింది. అనంతరం అక్కడి నుంచి లేచి ఆమె వెళ్లిపోయింది. అయితే.. ఈ స్ర్పే ఘాటు కొన్ని క్షణాల్లోనే కంపార్ట్‌మెంట్ అంతా వ్యాపించడంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో చూసిన మెట్రో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. సదరు కోచ్ నంబర్ తీసుకుని, చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు.. ప్రజా రవాణాలో ఇటువంటి గొడవలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సర్దుకుపోతే పోయేదాన్ని.. ఇంతదాకా తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
one more scene in Delhi metro pic.twitter.com/iQn9VJkvtI
— Tajinder Bagga (@TajinderBagga) April 1, 2023
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!