Maharashtra: అడవిలో గొలుసులతో బందీగా అమెరికా మహిళ.. రక్షించిన గొర్రెల కాపరి..
- మహారాష్ట్రలో దారుణం..
- సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో బందీగా అమెరికా మహిళ..
- గొర్రెల కాపరి చూడటంతో దక్కిన ప్రాణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా మహిళ గత కొన్ని రోజులుగా సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో గొలుసులతో ఒక చెట్టుకు నిర్బంధించబడి ఉంది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల లలితా కయీ కుమార్ ఎస్ అనే మహిళ తమిళనాడులో నివసిస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త అటవీలో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
సింధుదుర్గ్ లోని సోనుర్లి గ్రామ సమీపంలో ఆమె అత్యంత దయనీయ స్థితిలో శనివారం ఓ గొర్రెల కాపరికి కనిపించింది. ఆమె ఏడుపు వినిపించడంతో అటువైపు వెళ్లి చూడగా, ఆమెను గొలుసులో బంధించబడి ఉండటాన్ని చూసిన అతను పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను రక్షించిన పోలీసులు ప్రథమ చికిత్స కోసం సింధుదుర్గ్ లోని సావంత్వాడి తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓరోస్‌లోని ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
Read Also: Rahul Gandhi: దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఆమెకు చికిత్స అందించిన వైద్యుల ప్రకారం.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె తన ఆరోగ్య సమస్యల గురించి కాగితంపై రాసి తమతో చెప్పినట్లు వారు చెప్పారు. ఆమె 40 రోజులుగా ఆహారం తినకుండా ఉందని తెలిసింది. భర్తతో గొడవ పడటంతో అతను తనను అడవీలో బంధించినట్లు వెల్లడించారు. మహిళ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని, కొన్ని రోజులుగా ఏమీ తినకపోవడంతో బలహీనంగా ఉందని, అలాగే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆమెని ఎంత కాలంగా బంధించి ఉంచారో తెలియదని, దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఆమె దగ్గర తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, అమెరికా పాస్‌పోర్టు కాపీని కనుగొన్నట్లు వెల్లడించారు. ఆమె ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌తో టచ్‌లో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులకు ప్రాథమికంగా లభించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ గత 10 ఏళ్లుగా భారత్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!