Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..
- బెంగాల్ విభజనను సహించేది లేదు..
- కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒప్పుకోం..
- బీజేపీ ఎంపీ ప్రతిపాదనపై మండిపడ్డ మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ని విభజించే అన్ని చర్యల్ని తిప్పికొడుతామని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు. బెంగాల్‌ని విభజించేందుకు వారిని రానివ్వండి.. దాన్ని ఎలా అడ్దడుకోవాలో వారికి చెబుతాం అని అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలను విభజించి కొత్త కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల లోక్‌సభలో ప్రసంగించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
Also Read
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
ఇదే విధంగా బంగ్లాదేశ్‌తో తీస్తా నది నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, దానిని ఎప్పటికీ మేం అంగీకరించబోమని ఆమె చెప్పారు. వరదల నియంత్రణకు బీజేపీ సర్కార్ అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చినా, బెంగాల్ నిధులను మాత్రం తగ్గిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్‌కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలనే తాను డిమాండ్ చేశానని చెప్పారు.
ఇటీవల జార్ఖండ్‌కి చెంది బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కువయ్యారని అన్నారు. అక్కడ ఉన్న గిరిజనుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని ఆయన చెప్పారు. సంతాల్ పరగణా ప్రాంతంలోకి బంగ్లాదేశీ చొరబాటుదారులు ప్రవేశించి, గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో 36 శాతం గిరిజన జనాభా ఉంటే ప్రస్తుతం 26 శాతానికి తగ్గిందని, మిగతా 10 శాతం ఏమైపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్ని కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని లేకపోతే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.
తాజావార్తలు
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!