MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ
- స్టాలిన్‌ను బరిలోకి దించాలని తీర్మానం
- అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ చెన్నైలోని కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన అసెంబ్లీ వెలుపలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి శాసనసభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.
తిరుచ్చి ఈస్ట్ ఎందుకు ఖాళీ అయింది?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని మాత్రమే కొనసాగించాల్సి ఉండటంతో ఆయన పెరంబూర్ స్థానాన్ని కొనసాగిస్తూ తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.
Also Read
- Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
స్టాలిన్‌ను బరిలోకి దించాలని తీర్మానం
తిరుచ్చి దక్షిణ జిల్లా డీఎంకే కార్యవర్గం ఇప్పటికే ప్రత్యేక తీర్మానం చేసి, తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్‌ను పోటీ చేయించాలని పార్టీ నాయకత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు మాజీ మంత్రులు కే.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యామొళి వంటి నేతలు కూడా మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.
‘స్టాలిన్ త్వరలోనే అసెంబ్లీలోకి వస్తారు’
మాజీ మంత్రి, తిరుచ్చి వెస్ట్ ఎమ్మెల్యే కే.ఎన్. నెహ్రూ ఇటీవల మాట్లాడుతూ, స్టాలిన్ త్వరలోనే తమిళనాడు అసెంబ్లీలోకి తిరిగి వస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు
ప్రస్తుతం తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికకు సంబంధించి డీఎంకే అభ్యర్థిని పార్టీ ప్రకటించలేదు. స్టాలిన్ స్వయంగా బరిలోకి దిగుతారా? లేక మరో నేతకు అవకాశం ఇస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!