భార్య భర్తలు విషయంలో అన్యోన్యత లోపిస్తోంది. ఇద్దరు అర్ధం చేసుకునే మనస్తత్వాలు లేకుండా పోతున్నాయి. భారభర్తలు అన్నాక గొడవలు సహజం. చిన్న చిన్న విషయాలకు విచక్షణ కోల్పోయి ప్రవర్తాస్తున్నారు. కోపంలో ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. ఒకరినొకరు దాడి చేసుకునేందు, ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనే జార్ఖండ్ లో చోటుచేసుకుంది.
వివారల్లో వెలితే.. జార్ఖండ్ లోని జోర్భితా గ్రామానికి చెందిన దంపతులు గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతరకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఇంటికి వచ్చాక భార్య జీన్స్ వేసింది. దీంతో దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాహం తర్వాత జీన్స్ వేసుకోవడం ఏంటని భర్త వాదించడంతో.. భార్య ఎందుకు వేసుకోకూడదంటూ వాదించింది. ఇలా ఇద్దరిమధ్య గొడవ పీక్ స్టేజ్ కు వెల్లింది. మాట మాట పెరిగి ఆవేశానికి గురైన భార్య పుష్ప, భర్త హెంబ్రోమ్ పై కత్తితో దాడి చేసింది. విచక్షనారహితంగా భర్తపై భార్యపుష్ప దాడిచేయడంతో.. భర్త హెంబ్రోమ్ తీవ్రంగా గాయపరిచింది. ఇది కాస్త కుటుంబసభ్యుల వరకు వెల్లడంతో.. హెంబ్రోమ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. హెంబ్రోమ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. కన్నకొడుపై దాడిచేసి ప్రాణాలు తీసిన కోడలు పుష్పపై మృతుడి తండ్రి కేసుపెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.