BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు జిన్‌పింగ్ గైర్హాజరు..
- సుదీర్ఘ ప్రయాణం, టైమ్ జోన్ మార్పు, బిజీ షెడ్యూల్‌తో చైనా అధ్యక్షుడు బిజీ..
- అలసట కారణంగానే హాజరుకాలేదని సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS: బ్రిక్స్ సదస్సు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. జిన్‌పింగ్‌తో పాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ సహా మరికొందరు నేతలు కూడా ఈ విందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం బ్రిక్స్ సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న జిన్‌పింగ్, ఆ తర్వాత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత బ్రిక్స్ దేశాధినేతలకు, ప్రముఖులకు ఏర్పాటు చేసిన అధికారిక విందులో జిన్‌పింగ్ కనిపించలేదు.
అయితే, సుదీర్ఘ ప్రయాణం, టైమ్ జోన్ మార్పు కారణంగా జిన్‌పింగ్ తీవ్ర అలసట గురైనందునే జిన్‌పింగ్ విందుకు హాజరు కాలేదని తెలుస్తోంది.ఢిల్లీలో దిగిన తర్వాత జిన్‌పింగ్ వరసగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సుతో పాటు మోడీతో భేటీ కూడా ఉండటంతో ఆయన తొలి రోజు షెడ్యూల్ బిజీ బిజీగా గడిచింది.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మోడీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా విందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పార్లమెంట్ భవన్ నుంచి రెండు బస్సుల్లో ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకుని విందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల్లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా హాజరయ్యారు.
రెండు రోజుల బ్రిక్స్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. వచ్చే 19వ బ్రిక్స్ సదస్సు చైనాలో జరగబోతోంది. 11 సభ్యదేశాలతో పాటు 10 భాగస్వామ్య దేశాల నేతలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని మోడీ రెండో రోజు కూడా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?