Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సుధీర్.. ఈ మధ్యనే కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ సినిమాలో సుధీర్ సరసన స్టార్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. అయితే గాలోడు కన్నా ముందే సుధీర్ ఒక సినిమాలో నటించాడు. అదే కాలింగ్ సహస్త్ర. అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన డాలీషా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సుధీర్ కోసం ఏకంగా ఫేమస్ సింగర్ ks చిత్రమ్మనే రంగంలోకి దింపేశారు మేకర్స్. ఈ సినిమాలోని మొదటి సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం పెట్టారు.
Tillu Square: అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే
కలయా.. నిజమా అంటూ సాగే పాటను జూన్ 7 న రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ.. ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటను సింగర్ Ks చిత్ర పాడటం విశేషం. లక్ష్మీ ప్రియాంక ఈ సాంగ్ కు లిరిక్స్ అందించింది. చిత్ర జడ్జిగా వ్యవహరించిన సూపర్ సింగర్ జూనియర్స్ కు సుధీర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ అనుబంధంతోనే సుధీర్ కోసం చిత్ర ఆ సాంగ్ పాడినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నకొద్దిగా సుధీర్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిస్తే.. సుధీర్ హిట్ హీరోల్లో చేరే అవకాశం ఉంది. మరి ఈ సినిమాను సుధీర్ అభిమానులు హిట్ అయ్యేలా చేస్తారో లేదో చూడాలి.