Ajit Doval: అజిత్ దోవల్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఎందుకు వాడరు.?
- మొబైల్, ఇంటర్నెట్ వాడని అజిత్ దోవల్..
- ఓ కార్యక్రమంలో దోవల్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిద్ దోవల్ తన రోజూవారీ పనుల్లో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించనని వెల్లడించారు. ‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక యువకుడు.. ‘‘మీరు నిజంగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరా?’’ అని దోవల్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఇంటర్నెట్ వాడను, మొబైల్ ఫోన్ కూడా చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తాను. కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సినప్పుడు లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ వాడుతాను’’ అని చెప్పారు.
Read Also: Iran Protests: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
తన పని నిర్వహణకు సంబంధించి ఇతర భద్రమైన కమ్యూనికేషన్ మార్గాలు ఉన్నాయని, అవి సాధారణ ప్రజలకు తెలియవని దోవల్ చెప్పారు. జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాల్లో డిజిటల్ పరికరాల ఉపయోగం ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో దోవల్ వీటికి దూరంగా ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి దోవల్. కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దశాబ్ధాల నుంచి గూఢచార, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పనిచేశారు.
1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన దోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా చేరారు. ఆయన ధైరసాహసాలకు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును చిన్న వయసులో అందుకున్న పోలీస్ అధికారిగా రికార్డ్ క్రియేట్ చేశారు. దోవల్ తన కెరీర్లో మిజోరాం, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు కార్యక్రమాలను అణిచివేయడంలో పనిచేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కీలక పాత్ర పోషించారు. డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనాతో కఠినంగా వ్యవహరించారు. ఇదే కాకుండా 1999లో ఐసీ-814 విమానం హైజాక్ సమయంలో భారత ప్రభుత్వం తరుపున ఉగ్రవాదులతో చర్చలు జరిగే బృందంలో దోవల్ ఉన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!