Former CM Returns Bulletproof Vehicle: 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. ప్రభుత్వానికి తిరిగిచ్చిన మాజీ సీఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former CM Returns Bulletproof Vehicle: జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మారండీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన భద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం తరచూ మార్గమధ్యలోనే మొరాయిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆ వాహనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మాజీ ముఖ్యమంత్రుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బాబులాల్ మారండీ లేఖ రాశారు. తన బుల్లెట్‌ప్రూఫ్ వాహనం పరిస్థితి అధ్వానంగా ఉందని 2026 మార్చి 21నే ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వాహనాన్ని మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన భద్రతా వాహనాన్ని మార్చకుండా ఎవరి ఆదేశాల మేరకు అధికారులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
కేవలం తన వాహనమే కాకుండా భద్రతా సిబ్బంది ఉపయోగించే జీపుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని మారండీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వాహనాలు సైతం పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. ఈ విషయంపై డీజీపీ, ఐజీ, హోంశాఖ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని లేఖలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా భద్రతా ఏర్పాట్లను కూడా మారండీ ప్రస్తావించారు. ఆయన కాన్వాయ్‌లోని వాహనాల దుస్థితి, నవంబర్ 6న జాతీయ రహదారి 33పై చౌకా సమీపంలో జరిగిన ప్రమాదాన్ని ఉదహరించారు. ముఖ్యమంత్రికి కొత్త, మెరుగైన వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం.. మాజీ ముఖ్యమంత్రుల భద్రత విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని నిలదీశారు.
Also Read
- Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
- Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
- Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రులందరి భద్రతా వాహనాలను ఒకే ప్రమాణాలతో సమీక్షించాలని, తక్షణమే సురక్షితమైన, మెరుగైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను కేటాయించాలని బాబులాల్ మారండీ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఒక కీలక ప్రశ్న సంధించారు. ప్రస్తుతం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మీరూ మాజీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రభుత్వాన్ని ఎలాంటి జవాబుదారీతనంతో ప్రశ్నిస్తారని నిలదీశారు. తన భద్రత కోసం కేటాయించిన పాత బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
-
Former CM Returns Bulletproof Vehicle: 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. ప్రభుత్వానికి తిరిగిచ్చిన మాజీ సీఎం!
-
Potato Snacks: బండి మీద కంటే టేస్టీగా.. ఇంట్లోనే క్రిస్పీ ఆలూ పకోడీలు! తింటే వదిలిపెట్టరు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!