Site icon NTV Telugu

Bihar CM: బీహార్ తదుపరి సీఎం ఎవరు? ఎక్స్ నుంచి జేడీయూ పోస్ట్ తొలగింపు!

Nitish Kumar

Nitish Kumar

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకోగా.. ఇటు బీహార్‌లో జేడీయూ కార్యకర్తలు కూడా వేడుకలు జరుపుకున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Terror Blast Case: ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం.. నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు

ఎన్డీఏ కూటమికి విజయమైతే దక్కింది గానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది సందిగ్ధం నెలకొంది. గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎక్స్‌లో పోస్ట్ చేసిన దాన్ని తొలగించడంతో కొత్త చర్చ మొదలైంది. శుక్రవారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక జేడీయూ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది. కానీ అంతలోనే తొలగించింది. దీంతో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరన్నది కొత్త చర్చ మొదలైంది.

ఎక్స్‌లో పోస్ట్ ఇదే..
‘‘నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందని.. ఈ విజయం అపూర్వమైనది.. సాటిలేనిది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.. తర్వాత కొనసాగుతారు.’’ అంటూ జేడీయూ ట్వీట్ చేసింది. కానీ కొన్ని క్షణాలకే పోస్టును జేడీయూ తొలగించింది. దీంతో బీహార్ తదుపరి ముఖ్యమంత్రిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి నితీష్ కుమార్ కాకుండా.. ఆ స్థానంలో కొత్త ఫేస్ రాబోతుందంటూ చర్చ మొదలైంది.

ఇది కూడా చదవండి: Mehbooba Mufti: ఉగ్రవాది ఇంటిని పేల్చివేయడాన్ని ఖండిస్తున్నా.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం సంచలన ప్రకటన..

వాస్తవంగా బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఎన్డీఏ కూటమి బరిలోకి దిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకసారి మోడీ మాట్లాడుతూ.. నితీష్ నేతృత్వంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కానీ మిగతా బీజేపీ నాయకులెవరూ కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే బరిలోకి దిగారు. అప్పుడు ఏక్‌నాథ్‌షిండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తీరా ఎన్నికల్లో గెలిచాక షిండేను పక్కన పెట్టి.. దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. జేడీయూ కంటే ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, ఎంఐఎం 5 సీట్లు సాధించాయి. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో కమలనాథుడే ఈసారి ముఖ్యమంత్రి అవ్వొచ్చని ఊహాగానాలు నడుస్తున్నాయి.

Exit mobile version