Bihar CM: బీహార్ తదుపరి సీఎం ఎవరు? ఎక్స్ నుంచి జేడీయూ పోస్ట్ తొలగింపు!
- బీహార్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- ఎక్స్ నుంచి జేడీయూ కీలక పోస్ట్ తొలగింపు!
- బీహార్ తదుపరి సీఎం ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకోగా.. ఇటు బీహార్‌లో జేడీయూ కార్యకర్తలు కూడా వేడుకలు జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Terror Blast Case: ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం.. నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్‌లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
ఎన్డీఏ కూటమికి విజయమైతే దక్కింది గానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది సందిగ్ధం నెలకొంది. గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎక్స్‌లో పోస్ట్ చేసిన దాన్ని తొలగించడంతో కొత్త చర్చ మొదలైంది. శుక్రవారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక జేడీయూ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది. కానీ అంతలోనే తొలగించింది. దీంతో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరన్నది కొత్త చర్చ మొదలైంది.
ఎక్స్‌లో పోస్ట్ ఇదే..
‘‘నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందని.. ఈ విజయం అపూర్వమైనది.. సాటిలేనిది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.. తర్వాత కొనసాగుతారు.’’ అంటూ జేడీయూ ట్వీట్ చేసింది. కానీ కొన్ని క్షణాలకే పోస్టును జేడీయూ తొలగించింది. దీంతో బీహార్ తదుపరి ముఖ్యమంత్రిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి నితీష్ కుమార్ కాకుండా.. ఆ స్థానంలో కొత్త ఫేస్ రాబోతుందంటూ చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: Mehbooba Mufti: ఉగ్రవాది ఇంటిని పేల్చివేయడాన్ని ఖండిస్తున్నా.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం సంచలన ప్రకటన..
వాస్తవంగా బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఎన్డీఏ కూటమి బరిలోకి దిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకసారి మోడీ మాట్లాడుతూ.. నితీష్ నేతృత్వంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కానీ మిగతా బీజేపీ నాయకులెవరూ కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే బరిలోకి దిగారు. అప్పుడు ఏక్నాథ్షిండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తీరా ఎన్నికల్లో గెలిచాక షిండేను పక్కన పెట్టి.. దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. జేడీయూ కంటే ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, ఎంఐఎం 5 సీట్లు సాధించాయి. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో కమలనాథుడే ఈసారి ముఖ్యమంత్రి అవ్వొచ్చని ఊహాగానాలు నడుస్తున్నాయి.

తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్‌గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?