Nirmala Sitharaman: రాహుల్ గాంధీ ఎక్కడ..? తమిళనాడు కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ..?
- కళ్లకురిచి కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం..
- రాహుల్ గాంధీ
- ఖర్గే ఎక్కడ..?
- దళితులు చనిపోయినా పట్టించుకోరా..?
- తమిళనాడు ఘటనపై నిర్మలా సీతారామన్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kallakurichi hooch tragedy: తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 50 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.
ఇంతపెద్ద సంఘటన జరిగినా కూడా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 200 మందికి పైగా ప్రజల పరిస్థితి విషమంగా ఉంది. 56 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నారు. ‘టాస్మాక్’ అని పేరుతో ప్రభుత్వం నడుపుతున్న దుకాణాల నుంచి లైసెన్సులు పొందిన మద్యం దుకాణాల మందుతాగి వారు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది..’’ అని ఆమె అన్నారు.
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
Read Also: Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
కళ్లకురిచిలో కెమికల్ ఆధారిత కల్తీ మద్యం తయారుచేస్తున్నారని, కాంగ్రెన్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. కల్తీ మద్యంతో దళితులు చనిపోతున్నా రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. తమిళనాడులో ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి. ఈ విషయంలో నోరు మొదపని ఇండియా కూటమి నేతలు కనీసం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద మరణించిన వారి పట్ల గౌరవంగా మౌనం కూడా పాటించలేదని బీజేపీ మండిపడింది.
‘‘ 56 మంది చనిపోయారు. చాలా మంది క్రిటికల్‌గా ఉన్నారు. చనిపోయిన వారిలో 40 మందికి పైగా దళితులే ఉన్నారని, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, డీఎంకే నేతలు, ఇండియా కూటమి పార్టీలు దీనిపై మౌనంగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి గోకుల్‌దాస్ నేతృత్వంలో విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నారు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..