WhatsApp: బాంబ్ పేల్చిన వాట్సాప్.. ఇకపై ఆ ఫోన్లలో సేవలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Will Stop Working On These Phone Devices From October 24: మారుతున్న కాలానికి అనుగుణంగా.. టెక్ కంపెనీలు సహా సోషల్ మీడియా సంస్థలు తమ నిబంధనల్ని మారుస్తుంటారు. ఈ క్రమంలోనే పాత డివైజ్‌లకు తమ సేవల్ని నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటిస్తుంటాయి. యూజర్ల కౌంట్ తగ్గినా.. నిబంధనలను కట్టుబడి ఉండాల్సింది కాబట్టి, తప్పకుండా ఆ కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా వాట్సాప్ అదే పని చేస్తోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొన్ని మోడల్స్‌కు అక్టోబరు 24వ తేదీ నుంచి తమ సేవల్ని నిలిపివేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. సెక్యూరిటీ ఫీచర్ల అప్‌గ్రేడ్, యూజర్ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్‌లో భాగంగానే.. తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది.
ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో పని చేస్తోన్న ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ చేయదు. ప్రస్తుతం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ ఫోన్లు ఆ ఓఎస్‌లతోనే పని చేస్తున్నాయి. ఒకవేళ ఆ ఫోన్లలో వాట్సాప్ పని చేయాలంటే.. తమ ఓఎస్‌లను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ సూచించింది. కానీ.. యాపిల్ నిబంధనల ప్రకారం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్ మోడల్స్‌లో ఓఎస్ అప్‌డేట్ అవ్వదు. అంటే, ఇకపై ఈ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండవన్నమాట! కేవలం.. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ మోడల్స్ మాత్రమే ఓఎస్ అప్‌డేట్‌కు అవకాశముంది. కాబట్టి.. వీటిల్లో వాట్సాప్ పని చేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్‌కి వస్తే.. 4.0.4 వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. యూజర్లు వెంటనే తమ వర్షన్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!