* ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.. వైజాగ్ లో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్న సీఎం చంద్రబాబు..
* విజయవాడ: సాయంత్రం 6 గంటలకు టీచర్స్ డే వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
* హైదరాబాద్: ఇవాళ ఖైరతాబాద్ గణేష్‌ని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ గణేష్‌కు సీఎం ప్రత్యేక పూజలు
* హైదరాబాద్: నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అవార్డ్స్ ప్రదానోత్సవం.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. పాఠశాల విద్యాశాఖలో 49 మంది టీచర్లకు ఉత్తమ అవార్డులు
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 9:00 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించనున్న హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్ , హైదరాబాద్ సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ,హైదరాబాద్ కలెక్టర్ ఇతర అధికారులు
* నేడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ డివిజన్లలో గణనాథుల్ని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
* అమరావతి : తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవ కార్యక్రమం, హాజరుకానున్న పార్టీ ముఖ్య నేతలు..
* విశాఖ: నేటి నుంచి ఎంజీఎం మైదానంలో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్.. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్
* విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీలో నేడు సైన్స్ కాంక్లేవ్.. ఏయూ- ఏఎస్టీసీ సంయుక్తంగా నిర్వహణ.. ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఐ.ఎస్.ఐ డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ
* నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్.ఆర్ విశ్వనాథన్ , సి. విష్ణు రెడ్డి..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు గురు పూజోత్సవం సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం.. రాజమండ్రి శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్
* గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో నేడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు పర్యటన. వరుస మరణాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో గ్రామంలోని పరిస్థితులు తెలుసుకోనున్న పెమ్మసాని.
* తిరుమల: ఎల్లుండి చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత.. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎల్లుండి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8వ తేది ఉదయం 6 గంటల వరకు దర్శనాలు నిలిపివేత.. 7వ తేదీ రాత్రి పౌర్ణమి గరుడ సేవ రద్దు.. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. 8వ తేదీ విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
* తిరుపతి: నేటి నుంచి మూడు రోజుల పాటు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
* విజయవాడ: యూ పిక్స్ కేసులో నిందితులను నేడు కస్టడీ కి తీసుకోనున్న పోలీసులు.. ఏ1 కిరణ్, ఏ2 రాజేంద్ర బాబు, రాజీవ్ కృష్ణలను ఇవాళ జైలు నుంచి కస్టడీ కి తీసుకుని విచారణ చేయనున్న పోలీసులు
* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. 3 గేట్లు 10 అడుగుల ఎత్తివేత.. ఇన్ ఫ్లో 1,46,186 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,48,899 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* తూర్పు గోదావరి జిల్లా: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి.. బ్యారేజీ వద్ద 11.50 అడుగులకు చేరిన వరద నీటిమట్టం.. 11.75 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
* నేడు శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి ఆలయంలో అమ్మవారికి శ్రవణానక్షత్ర పూజలు.. అమ్మవారి ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ఊయల సేవ
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయాయి.. వెలుపల కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,834 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,628 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు
* అనంతపురం : నేటి నుంచి అనంతపురం నగరంలో రాష్ట్రస్థాయి నాటక పోటీలు ప్రారంభం.