* హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం.. కాళేశ్వరం రిపోర్టు.. బీసీ రిజర్వేషన్లపై చర్చ
* హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం.. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
* నేడు విశాఖలో జనసేన పార్టీ.. సేనతో సేనాని సభ.. హాజరుకానున్న రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీలక కార్యకర్తలు.. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగం.. సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం
* చిత్తూరు: నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఉదయం 10 గంటలకు కుప్పం మండలం హంద్రీనీవా కాల్వ పరమసముద్రం గ్రామానికి చేరుకుని కృష్ణా జలాలకు ‘జలహారతి’.. అనంతరం పలు కంపెనీలతో ఒప్పందాలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం.. మధ్యాహ్నం బహిరంగ సభ…
* నేడు హైదరాబాద్ మెట్రో సమయం పొడిగింపు.. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది.. మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా.. ఎక్కువ సమయం.. ఎక్కువ భక్తి.. ఎక్కువ సౌకర్యం అంటూ మెట్రో ప్రకటన.
* పోలవరం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి.. ప్రాజెక్టు 48 గేట్ల నుండి దిగువకు 8,78,421 క్యూసెక్కుల వరద ప్రవాహం..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ రాజమండ్రి పర్యటన.. జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న శైలజ
* ఏలూరు: పోలవరంలో రెండో రోజు కొనసాగనున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన.. పోలవరం ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్, బాట్రెస్ డ్యామ్ నిర్మాణం, డివాటరింగ్ పనులను పరిశీలించనున్న బృందం..
* తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రి వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.30 అడుగులకు చేరిన గోదావరి వరద నీటిమట్టం.. బ్యారేజీ 175 కేట్ల నుండి 7 లక్షల 93 వేల 608 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల.. ఎగువ ప్రాంతాల్లో వరద నీటి మట్టాలు పెరుగుతున్న కారణంగా ఇక్కడ కూడా మరింత పెరిగే అవకాశం
* కడప : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ఉప ఎన్నికల్లో ఎన్నికైన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలు
* గుంటూరులో నేడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన. కలెక్టరేట్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలో పాల్గొనున్న పెమ్మసాని
* భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 46.40 అడుగులు. 10, 68,602 క్యూసెక్కుల నీరు ప్రవాహం.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
* సింగూరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల.. రెండు జెన్ కో గేట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అధికారులు
* నిర్మల్: బాసర వద్ద గోదావరి నది ఉధృతి.. జలమయం అయిన పుష్కర ఘాట్ నుంచి అమ్మవారి ఆలయంకు వెళ్ళే దారి. బాసరలోని సరస్వతీ ఆలయం సమీపంలోని రోడ్డు పైకి చేరిన వరద నీరు.
* కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 14 గేట్లు ఎత్తివేత.. ఇన్ ఫ్లో 1,12,539 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 79,256 క్యూసెక్కులు
* నిర్మల్: బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.
* నిజామాబాద్: శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద, 39 వరద గేట్లు ఎత్తివేత.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5లక్షల 50 వేల క్యూసెక్కులు
* ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు-ఏపీఎస్డీఎంఏ