What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు సౌతాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య ఐదో టీ20.. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా..
* ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
* బెంగాల్‌లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి ఉదయం రెండో విడత పోలింగ్.. మే 4న ఫలితాలు..
* నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్.. తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఎగరవేయనున్న కేటీఆర్. గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం… హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ లు. నేతలతో తాజా రాజకీయ పరిణామాల పై చర్చ.. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం ఉండే అవకాశం..!.
* విశాఖ: నేడు ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలు… ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో పూర్తైన ఏర్పాట్లు… ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. గౌరవ అతిథిగా సచిన్ టెండూల్కర్.. వేడుకల్లో పాల్గొనున్న గవర్నర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
* నేడు, రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఇవాళ విశాఖలో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం.. రేపు గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 10.30కి ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్న అజారుద్దీన్.. కోదండరాం.. ప్రమాణ స్వీకారం చేయించనున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
* కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నేడు ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు.. సాక్షులను బెదిరించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న అనంతబాబు
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నివాసంలో SIPB సమావేశం.. ఏపీకి వచ్చే పెట్టుబడులపై సమీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో డీజిల్ కొరతపై సీఎం సమీక్ష..
* అనంతపురం : ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో ప్రజా దర్బార్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* అనంతపురం : ఉరవకొండ పరిధిలోని పెన్నహోబిలంలో రేపటి నుంచి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మే 4 న గరుడ వాహనోత్సవం… శ్రీవారి కల్యాణోత్సవం…. 6న బ్రహ్మరథోత్సవం
* తిరుమల: 30 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,878 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 33,037 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి బిల్వార్చన, తులసి అర్చన, పుష్పర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, రుధ్రాభిషకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు.
* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. ఇవాళ గరుడ వాహనం పై నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న మలయప్పస్వామి.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు
* ఆదిలాబాద్: నేటి ప్రజావాణి రద్దు.. జిల్లా ఉన్నతాధికారులకు హైదరాబాద్ లో సమీక్ష కారణంగా ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రకటన.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!