Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* హైదరాబాద్‌: ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు..

* తెలంగాణలో పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. పెట్రోల్‌ బంక్‌లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు.. నిన్నటి నుంచి పెట్రోల్‌ కోసం బారులు తీరిన వాహనదారులు.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాలా చోట్ల పెట్రోల్‌ బంక్‌లు క్లోజ్‌.. ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్‌ బంక్‌లు..
ఫిల్లింగ్‌ స్టేషన్‌లు ఓపెన్‌ చేయకముందే భారీ క్యూలు

* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. ఉదయం 11 గంటలకు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్న జగన్‌.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్న జగన్..

* ఏలూరు: నేడు పోలవరానికి కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి VL కాంతారావు, PPA CEO యోగేష్.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని స్పిల్ వే, ఈసిఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన.. అనంతరం రాజమండ్రి సమీపంలో బొమ్మూరు వద్ద పిపిఏ కార్యాలయ ప్రారంభోత్సవం..

* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ముందుగా చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న అంబటి .. అనంతరం కాపు కళ్యాణ మండపంలో కాపు నేతలతో సమావేశం

* నేడు గుంటూరుకు‌ రానున్న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీ కన్వెన్షన్ లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రెండో కుమార్తె వివాహానికి‌ హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వేడుకలు, బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం .. రాత్రి బేరీతాండవం, దేవత ఆహ్వానం అనంతరం బలి సమర్పణ.. హనుమద్వాహనంపై తిరువీధి సేవ

* ఖమ్మం నేడు జమలాపురం వెంకటేష్ స్వామి కళ్యాణం..

Exit mobile version