Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరుతో ఢిల్లీ ఢీ.. రాత్రి 7.30కి హైదరాబాద్‌తో చెన్నై మ్యాచ్‌

* ఢిల్లీ: ఇవాళ ఉ.11.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం. కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.. మలకోడు సరస్సు వద్ద నీటిమొక్కల (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన.. శాస్త్రవేత్తలు, ప్రజలతో పరస్పరం చర్చలు.. నిడదవోలు పట్టణంలోని సెయింట్ అంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు..

* గుంటూరు: కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. తన ఇల్లు, ఆఫీసుపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సాయంత్రం 6 గంటలకు అంబటితో దీక్ష విరమింపచెయ్యనున్న బొత్స సత్యనారాయణ.

* విశాఖ: నేటి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు.. ఈనెల 27న ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న ఏయూ, ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి., మాజీ క్రికెటర్ సచిన్

* తిరుమల: ఇవాళ నుంచి ఆన్‌లైన్‌లో జులై నెల దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే దర్శన టిక్కెట్లకు రిజిస్ట్రేషన్.. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు… 21వ తేది ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు .. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

* తిరుమల: 11 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,049 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 23,842 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు

* నంద్యాల: నేడు నందికొట్కూరులో అడిషనల్ కోర్టు ప్రారంభం

* నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించనున్న నేతలు.. ఈనెల 20న జగిత్యాలలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా మినీ స్టేడియంలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన..

* ఆదిలాబాద్: నేటి నుంచి జిల్లా మొక్క జొన్న కొనుగోలు.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్న అధికారులు.. క్వింటాల్ కు రూ.2400.. జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్

* సంగారెడ్డి: నేడు ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర

తెలంగాణవ్యాప్తంగా నేడు నిరసనలకు పిలుపునిచ్చిన బీజేపీ.

Exit mobile version