* ముంబై: నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎంగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న ఫడ్నవీస్.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతలు
* హైదరాబాద్: ఉదయం 10.30కు సెక్రటేరియట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన – విజయోత్సవాల్లో రవాణా శాఖ వేడుకల్లో పాల్గొననున్న సీఎం.. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్ లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం
* ఖమ్మం: నేడు సత్తుపల్లిలో 203 ఎకరాల్లో 100 కోట్లతో చేపట్టిన ఫుడ్ పార్క్ ను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాల్గొననున్న ఇతర మంత్రులు
* అమరావతి: నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశం కానున్న వైఎస్ జగన్.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం
* తూర్పుగోదావరి: నేడు ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 116 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ.. మొత్తం 16,737 మంది టీచర్స్ ఓటర్లు.. పోటీలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ
* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణరెడ్డిలు.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తిరుపతి: నేడు PSLV C-59 రాకెట్ ప్రయోగం.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు.. నిన్న రాకెట్ లోని ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించి ప్రయోగాన్ని వాయిదా చేసిన ఇస్రో
* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో ఉంటారు..
* ప్రకాశం : గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
* అనంతపురం : ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నేటి నుంచి న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణకు పిలుపు
* విశాఖ: నేడు నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాత్రి 9.30 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు సీఎం.. రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై సమీక్ష
* తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు భాగంగా ఉదయం రథోత్సవం… రాత్రి అశ్వ వాహనంపై తిరుమాఢ విధుల్లో విహరించనున్న పద్మావతి అమ్మవారు
* శ్రీ సత్యసాయి : పెనుకొండలోని కియా పరిశ్రమను సందర్శించనున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.
* విజయవాడ పర్యటనలో మంత్రి పయ్యావుల కేశవ్.
* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,265 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,384 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు
* అమరావతి: ఇవాళ మహారాష్ట్ర కు సీఎం చంద్రబాబు.. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు.. మహారాష్ట్ర నుంచి నేరుగా విశాఖ వెళ్ళనున్న సీఎం చంద్రబాబు